: ‘డీజే’ వివాదం పరిష్కారం: ఆ పదాలను తొలగిస్తామని చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్


స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేషన్‌లో వ‌స్తున్న ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ సినిమాలోని ‘గుడిలో బ‌డిలో మ‌డిలో వ‌డిలో’ అనే పాట‌లో వాడిన కొన్ని ప‌దాల‌పై బ్రాహ్మ‌ణ సంఘాలు అభ్యంత‌రాలు తెలుపుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై వివాదం చెల‌రేగుతుండ‌డంతో హ‌రీశ్ శంక‌ర్ వెన‌క్కుత‌గ్గారు. ఈ పాట‌లో ఉప‌యోగించిన‌ అగ్ర‌హారం, త‌మల‌పాకు అనే ప‌దాలను తొల‌గించాల్సిందేన‌ని బ్రాహ్మ‌ణ సంఘాల ప్ర‌తినిధులు ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆయా ప‌దాల‌ను తొలగిస్తామ‌ని ద‌ర్శ‌కుడు చెప్పారు.

ఈ పాటలో ప్రయోగించిన ‘నమక చమకాలు’, ‘ప్రవర’, ‘అగ్రహారం’తో పాటు అన్ని పదాలను తొలగిస్తామని ఆ పాట రచయిత సాహితి కూడా తెలిపారు. ఈ రోజు బ్రాహ్మణ సంఘం నేతలు హరీశ్ శంకర్‌, సాహితిలను వారి కార్యాలయంలో కలిసిన నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేశారు. వారిద్ద‌రికీ బ్రాహ్మ‌ణ సంఘం నేత‌లు ‘నమక, చమకాల’ ప్రాశస్త్యాన్ని వివరించి చెప్పారు. తాము ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ పాటను రాయలేదని హ‌రీశ్ శంక‌ర్ అన్నారు.                                 

  • Loading...

More Telugu News