: సరబ్ జిత్ మృత దేహంలో అవయవాలు ఏమయ్యాయి?


భారత్ కు చేరిన సరబ్ జిత్ సింగ్ మృత దేహానికి అమృత్ సర్ లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. సరబ్ మృత దేహంలో ప్రధాన అవయవాలు లేవని వైద్యుల పరిశీలనలో తేలింది. గుండె, పిత్తాశయం, కాలేయం, మూత్రపిండాలు లేనట్లు వైద్యులు వెల్లడించారు. పంజాబ్ కు చెందిన ఫోరెన్సిక్ వైద్యులు గుర్జిత్ మాన్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది.

గుండెపోటుతో సరబ్ కన్నుమూశాడని లాహోర్ లోని జిన్నా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కానీ, తలకు తగిలిన గాయం వల్లే సరబ్ మరణించి ఉండొచ్చని మాన్ చెప్పారు. సరబ్ తల వెనుక భాగంలో చాలా బలమైన గాయాలున్నాయని తెలిపారు. 5 పక్కటెముకలు కూడా విరిగిపోయాయని చెప్పారు. దీన్ని బట్టి సరబ్ పై పాక్ ఖైదీలు తీవ్రదాడికి పాల్పడినట్లు అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News