: డూప్ లేకుండా రిస్కీ షాట్ ను చేసిన బాలయ్య.. ఆశ్చర్యపోయిన హీరోయిన్ శ్రియ!


బాల‌కృష్ణ హీరోగా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న చిత్రం ప్ర‌స్తుతం పోర్చుగ‌ల్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ నెల 10న బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా పేరును వెల్ల‌డిస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ మాఫియా డాన్‌గా క‌నిపించనున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా పూరి జ‌గ‌న్నాథ్ మీడియాకు తెలుపుతూ... లిస్బన్‌లో నిన్న‌ ఓ ఛేజింగ్ సీన్‌ను చిత్రీక‌రించామ‌ని, ఈ సీన్‌లో కారుని డ్రిఫ్టింగ్ పద్ధతిలో 360 డిగ్రీలు తిప్పే షాట్‌ను రూపొందించామ‌ని చెప్పాడు.

ఇందులో రిస్కీ షాట్‌ను బాల‌కృష్ణ‌ రెండు సార్లు డూప్ లేకుండా అద్భుతంగా చేశారని ప్ర‌శంసించారు. ఈ షాట్‌లో బాల‌కృష్ణ అద్భుతంగా ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తోంటే ఆయన పక్కనే ఉన్న శ్రియ ఆశ్చర్యం వ్య‌క్తం చేసింద‌ని అన్నారు. బాల‌కృష్ణ‌కు సినిమాపై ఉన్న పాషన్‌తోనే ఇలా రిస్కీ షాట్‌లో పాల్గొన్నార‌ని పూరి చెప్పారు. పోర్చుగల్ టెక్నీషియన్లు, చిత్రయూనిట్ అంతా ఆయ‌న‌ను చప్పట్లతో అభినందించారని అన్నారు.

  • Loading...

More Telugu News