: ట్రంప్ నిర్ణయం ఏ మాత్రం ప్రభావం చూపదు: ‘యాపిల్’ సీఈవో


పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తన సంస్థ ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. వాతావరణంలో మార్పులు సహజమని, మనమంతా బాధ్యతతో వ్యవహరించి ఈ విషయాన్ని అందరికీ తెలియజెప్పాలని కోరారు. భవిష్యత్తులో ఇ-వ్యర్థాల వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయడమే లక్ష్యమని  ఆ లేఖలో కుక్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు యాపిల్ చేసే కృషిపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News