: శాస్త్రవేత్తలకు సెల్యూట్... ఈ రోజు చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది: ఇస్రో ఛైర్మ‌న్


భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో చ‌రిత్ర‌లో మ‌రో ఘ‌న‌ విజ‌యం న‌మోదైన సంద‌ర్భంగా ఆ సంస్థ ఛైర్మ‌న్ కిర‌ణ్‌కుమార్ మాట్లాడుతూ హ‌ర్షం వ్యక్తం చేశారు. జీఎస్‌ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ... జీశాట్-19 ఉపగ్రహాన్ని విజ‌య‌వంతంగా కక్ష్యలో ప్రవేశ‌పెట్టిందని ప్ర‌క‌టించారు. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని సాధించిన త‌మ శాస్త్ర‌వేత్త‌ల‌ను ప్ర‌శంసిస్తున్నట్లు తెలిపారు. ఇస్రో చ‌రిత్ర‌లో ఇదో కొత్త అధ్యాయ‌మ‌ని చెప్పారు. ఇస్రో డైరెక్ట‌ర్‌ కున్హి కృష్ణ‌న్ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌ల‌కు సెల్యూట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. క్లిష్ట‌త‌ర‌మైన రాకెట్ల‌ ద్వారా ఉపగ్రహాలను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌డం భార‌త్‌కి అల‌వాటైపోయింద‌ని వ్యాఖ్యానించారు. ఇది దేశానికే గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు.        


  • Loading...

More Telugu News