: నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళుతున్న జీఎస్ఎల్వీ మార్క్-3 డీ1
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి నిప్పులు చిమ్ముతూ జీఎస్ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ నింగికి దూసుకెళుతోంది. ఈ ప్రయోగం ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం కోసం నిన్న సాయంత్రం 3.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.