: మా వాళ్లు బేసిక్స్ ను కూడా ఫాలో కాలేకపోయారు!: 'పాక్ ఓటమి'పై ఆ జట్టు కోచ్ ఆవేదన


ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలవడం పట్ల ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విఫలమయ్యారని... అదే సమయంలో భారత ఆటగాళ్లు అన్ని విధాలుగా రాణించారని చెప్పాడు. బేసిక్స్ ను కూడా పాక్ ఆటగాళ్లు ఫాలో కాలేకపోయారని అన్నాడు. పదే పదే క్యాచ్ లను వదిలేయడం, ఫీల్డింగ్ వైఫల్యంతో అనవసరంగా పరుగులు ఇవ్వడం, వికెట్లను డైరెక్ట్ గా కొట్టి రనౌట్లు చేయలేకపోవడం, వికెట్ల మధ్య పరుగెత్తడంలో విఫలం కావడంలాంటి పలు తప్పిదాలను తమ ఆటగాళ్లు చేశారని తెలిపాడు. మైదానంలో ఏదైతే చేయాలని తాము అనుకున్నామో... దీన్ని చేయలేకపోయామని చెప్పాడు. వన్డే క్రికెట్ లో పాక్ జట్టు ఎక్కడుంది అనే విషయాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.

  • Loading...

More Telugu News