: భారత్‌లో ఐదుగురు పాకిస్థానీయులను అరెస్టు చేసిన పోలీసులు
సరిహద్దులు దాటుకొని ఇండియాలోకి వచ్చిన ఐదుగురు పాకిస్థానీయులని ఈ రోజు ఉదయం రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై పోలీసులు మాట్లాడుతూ... తాము అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని వివరించారు. వారందరినీ లఖాసర్ గ్రామానికి దగ్గరలోని బార్మర్ బోర్డర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. భారత్‌కి రావడానికి వారివద్ద ఎటువంటి పత్రాలూ లేవని తెలిపారు. వారు భారత్‌లోకి ఎందుకు వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.