: వాస్తవానికి జీఎస్టీ వల్ల వినోదపు పన్ను తగ్గింది!: కమల హాసన్ విమర్శలపై జైట్లీ


కొత్తగా అమలు చేయనున్న జీఎస్టీలో సినీ పరిశ్రమపై  28 శాతం పన్ను విధించ‌డం ఏంట‌ని, అది చాలా ఎక్కువని.. ఇది అమ‌లైతే చిత్ర ప‌రిశ్ర‌మ కుదేల‌వుతుంద‌ని, తాను సినిమాల నుంచి త‌ప్పుకుంటాన‌ని సినీన‌టుడు క‌మ‌ల హాస‌న్ ఇటీవ‌ల ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ వివ‌ర‌ణ ఇచ్చారు. జీఎస్టీని త్వ‌ర‌లోనే అమ‌లు చేయ‌నున్న నేప‌థ్యంలో తాము ప్రతి అంశానికీ ప్రాముఖ్యత‌ ఇచ్చామ‌ని చెప్పారు. గతంలో వినోదపు పన్ను 29.1 శాతంగా ఉండేదని చెప్పిన జైట్లీ... జీఎస్టీతో దానిని 28 శాతానికి తగ్గించిన‌ట్లు తెలిపారు.           

  • Loading...

More Telugu News