: మెల్ బోర్న్ లో కలకలం రేపిన ఉగ్రవాది


ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఉగ్రవాది కలకలం రేపాడు. ఓ అపార్ట్ మెంటులోకి ప్రవేశించిన ఈ దుండగుడు ఓ మహిళను బంధించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు, ఓ పేలుడు శబ్దం కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో, పోలీసు బలగాలు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. దుండగుడితో మాట్లాడేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రోడ్లను పోలీసులు బ్లాక్ చేశారు. అంతేకాదు, సమీపంలో ఉన్న ప్రజలంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News