: చెప్పుతో తనను తాను కొట్టుకున్న టీడీపీ కార్పొరేటర్!


తన డివిజన్ పై నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపిస్తూ, టీడీపీ కార్పొరేటర్ ఉమా మహేశ్వరరావు తనను తాను చెప్పుతో కొట్టుకున్న సంఘటన అనంతపురంలో జరిగింది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ రోజు ‘మీ కోసం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు కూడా హాజరయ్యారు. తన డివిజన్ విషయమై అధికారుల పని తీరు సవ్యంగా లేదంటూ కమిషనర్ మూర్తి  ఎదుట సదరు కార్పొరేటర్ తన చెప్పుతో కొట్టుకున్నారు. ఈ సంఘటనతో మిగిలిన కార్పొరేటర్లు ఆశ్చర్యపోయారు.

  • Loading...

More Telugu News