: బన్నీ అభిమానులకు శుభవార్త.. మరికొన్ని గంటల్లో ‘డీజే’ ట్రైలర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. బన్నీ హీరోగా యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ట్రైలర్ మరి కొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని హరీశ్ శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించాడు. సాధారణంగా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయం గురించి కొన్ని రోజుల ముందే ప్రకటిస్తారు. అయితే, హరీశ్ శంకర్ ఒక్కసారిగా ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకే ఈ ట్రైలర్ రిలీజ్ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
ఈ సినిమా టీజర్, డీజే టైటిల్ సాంగ్‌లు ఇప్పటికే విడుదలయ్యాయి. మరోవైపు ఈ సినిమాలోని రెండో పాటలో బన్నీ చేసిన డ్యాన్స్‌ను సుమారు 1 నిమిషం పాటు లిరిక్స్ తో పాటు చూపించారు. అందులోని నమకం, చమకం, అగ్రహారం, తమలపాకు వంటి పలు పదాలను ఉపయోగించడం పట్ల వివాదం కూడా చెలరేగుతోంది.
Super Duper excited Guys .....
Sharp....... 7.30 Pm Today