: విష సంస్కృతిని ప్రవేశపెడుతున్నారు.. రానున్న తరాలకు ఇది మంచిది కాదు: చంద్రబాబుపై కేవీపీ ఫైర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ఆయన తీరు భవిష్యత్తు తరాలకు శాపం వంటిదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన సభను అధికార బలంతో అడ్డుకునేందుకు బాబు ప్రయత్నించారని మండిపడ్డారు. సభకు వెళ్లేవారిని దేశ ద్రోహులుగా చంద్రబాబు పేర్కొనడం దారుణమని అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు విష సంస్కృతిని ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. ఏపీ పునర్విభజన చట్టంలో లోపాలను సవరించుకుని, పార్లమెంటులో కొత్త చట్టం తీసుకురావడానికి అన్ని పార్టీలు కలిసి పోరాడాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రత్యేక భరోసా సభ విజయవంతమైందని కేవీపీ అన్నారు.

  • Loading...

More Telugu News