: నలుగురిపైకి దూసుకెళ్లిన జీపు.. ఒకరి మృతి
రోడ్డుమీద తాను నడుపుతున్న పోలీసు జీపునకు ఒక్కసారిగా ఓ ఆవు అడ్డురావడంతో దాన్ని రక్షించేందుకు ఆ జీపు స్టీరింగ్‌ను సడన్‌గా పక్కకు తిప్పాడు ఓ డ్రైవర్. దీంతో, అదే సమయంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతోన్న ఓ వృద్ధురాలు, ఆమె ముగ్గురు మనవలపైకి ఆ జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు జీపు డ్రైవర్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో వృద్ధురాలు ఉషారాణి (60) అక్కడికక్కడే మృతి చెందిందని చెప్పారు. ముగ్గురు పిల్లలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.