: నిన్నటి నా ఇన్నింగ్స్‌ ను కేన్స‌ర్‌ విజేతలకు అంకితం చేస్తున్నాను: యువరాజ్ సింగ్


‘కేన్సర్‌ సర్వైవర్‌ డే’ను పురస్కరించుకొని నిన్న‌టి త‌న ఇన్నింగ్స్‌ను కేన్స‌ర్‌ను జయించిన వారికి అంకితం చేస్తున్న‌ట్లు టీమిండియా స్టార్ ఆట‌గాడు యువరాజ్ సింగ్ అన్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నిన్న పాకిస్థాన్ తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో యువ‌రాజ్ సింగ్ 32 బంతుల్లో 52 పరుగులు చేసి, అద్భుతంగా రాణించిన విష‌యం తెలిసిందే. మిగ‌తా బ్యాట్స్‌మెన్ కూడా రాణించ‌డంతో టీమిండియా 319 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ‌రాజ్ సింగ్‌కి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ వ‌చ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో యువ‌రాజ్ సింగ్ మొత్తం 8 ఫోర్లు, ఒక సిక్సర్ బాది, 29 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇంత వేగంగా అర్ధ‌శ‌త‌కం న‌మోదు చేసిన మొద‌టి ఆట‌గాడు యువీనే. అంతేగాక‌, పాక్‌పై వేగంగా హాప్‌ సెంచరీ సాధించిన రెండో టీమిండియా బ్యాట్స్ మెన్‌గా కూడా రికార్డు సాధించాడు.                  

  • Loading...

More Telugu News