: చైనా మళ్లీ తన బుద్ధి పోనిచ్చుకోలేదు... ఎన్ఎస్జీ పై మరోసారి కుటిల వైఖరి!


కీలకమైన అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ కు సభ్యత్వం కల్పించే విషయంలో దాయాది చైనా మరోసారి తన కుళ్లు వైఖరిని చాటుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ఎస్జీలో భారత్ కు చోటు అన్నది మరింత సంక్లిష్టంగా మారిందని చైనా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి లీహులై వ్యాఖ్యానించారు. అయితే ఆ పరిణామాలేంటన్నవి మాత్రం ఆయన చెప్పలేదు. 48 దేశాలతో కూడిన ఎన్ఎస్జీలో చోటు కల్పించే విషయంలో అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయని అన్ని దేశాల పట్లా ఒకే వైఖరిని అనుసరించాల్సి ఉందంటూ... పరోక్షంగా భారత్ కు మాత్రమే ఆ అవకాశాన్ని కల్పించాలనుకోవడాన్ని తప్పుబట్టింది. మెజారిటీ దేశాలు భారత్ కు చోటు కల్పించేందుకు మద్దతిస్తున్నా, చైనా మాత్రం ప్రతి దశలోనూ అడ్డుపడుతూనే వస్తోంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయలేదన్న ఏకైక సాకుతో భారత్ కు అవకాశం దక్కకుండా చూస్తోంది.

  • Loading...

More Telugu News