: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... 22 మంది సజీవ దహనం


ఉత్తరప్రదేశ్ లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ బస్సు అగ్ని కీలల్లో చిక్కుకోవడంతో 22 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బరేలీ జిల్లాలో 24వ నంబర్ జాతీయ రహదారిపై బడా బైపాస్ సమీపంలో రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ కు చెందిన ఓ ప్రయాణికుల బస్సును వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు ఢిల్లీ నుంచి 41 మంది ప్రయాణికులతో యూపీలోని గోండాకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో 22 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని కాలి బూడిదయ్యారు. వీరిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు.

మరో 15 మందికి గాయాలు కాగా వారిని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్టు పోలీసు అధికారి జోగేంద్రకుమార్ తెలిపారు. గుర్తు పట్టలేనంతగా కొందరి మృతదేహాలు కాలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షల కథనం. ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News