: యువీ అద్భుతం.. అతని ముందు ఓ క్లబ్ బ్యాట్స్ మెన్ లా చిన్నబోయా!: కోహ్లీ


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో స్ట్రాంగ్ మ్యాన్ యువరాజ్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 32 బంతుల్లో 53 పరుగులు (1 సిక్సర్, 8 ఫోర్లు) చేసి ఆట స్వరూపాన్నే మార్చేశాడు. మరో ఎండ్ లో కోహ్లీ నిలకడగా ఆడే ప్రయత్నం చేస్తుండగా, యువీ మాత్రం భారీ షాట్లతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో, యువీ బ్యాటింగ్ పై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.

యువీ చెలరేగిపోయి ఆడుతుంటే... ఓ క్లబ్ స్థాయి బ్యాట్స్ మెన్ లా తాను చిన్నబోయానని కోహ్లీ అంగీకరించాడు. క్రీజులో తాను కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో, యువీ అద్భుతంగా ఆడాడని... అతని ఆట తీరుతో తనలోని ఒత్తిడి అంతా మటుమాయమైందని చెప్పాడు. యువీ ముమ్మాటికీ గేమ్ ఛేంజరే అని... అందుకే అతడిని జట్టులోకి ఎంపిక చేశామని చెప్పాడు. యువీ లాంటి ప్లేయర్ క్రీజులో ఉంటే, అవతలి ఎండ్ లో ఉండే బ్యాట్స్ మెన్ కు ధైర్యంగా ఉంటుందని అన్నాడు.

  • Loading...

More Telugu News