: భగవద్గీత, ఉపనిషత్తుల అధ్యయనంలో రాహుల్... బీజేపీపై పోరాటం కోసమే!


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వయసులో భగవద్గీత, ఉపనిషత్తులను అధ్యయనం చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై పోరాటం కోసమే ఈ పనిచేస్తున్నట్టు చెన్నైలో జరిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశంలో వెల్లడించారు.

‘‘ఉపనిషత్తుల్లో ప్రజలు అందరూ సమానమేనని చెబితే, మీరు మాత్రం కొందరిని ఎందుకు అణగదొక్కుతున్నారో చెప్పాలని ఆర్ఎస్ఎస్ ను అడుగుతున్నాను. మీ మతం చెప్పిన దానికి భిన్నంగా మీరు ఎలా ప్రవర్తిస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు. భారతదేశ స్వరూపాన్ని బీజేపీ అర్థం చేసుకోవడం లేదన్నారు. వారు కేవలం నాగ్ పూర్ ను మాత్రమే (ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం) అర్థం చేసుకుంటారని విమర్శించారు.

తమిళ సినిమాలు చూస్తా... తమిళ సంస్కృతి నేర్చుకుంటా:


తమిళనాడుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న రాహుల్ గాంధీ ఇకపై తమిళ సినిమాలు చూడాలని నిర్ణయించుకున్నాని చెప్పారు. అలాగే, తమిళనాడు ప్రజల సంస్కృతిని సైతం తెలుసుకుంటానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ గందరగోళాన్ని అనువుగా మలుచుకుని కాంగ్రెస్ బలపడాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతిపక్షం ఐక్యంగా ఉందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ఓడిస్తామని పేర్కొన్నారు. దీనికి ముందు రోజు డీఎంకే అధినేత కరుణానిధి పుట్టిన రోజు సందర్భంగా రాహుల్ గాంధీ ఆయన్ను కలసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News