: జైల్లో ఉన్న శశికళతో నేడు భేటీ కానున్న దినకరన్!


అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో జైలు శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ నేడు కలవనున్నారు. ఆమెతో భేటీ అయ్యేందుకు దినకరన్ బెంగళూరు వెళ్లారు. పార్టీకి చెందిన రెండాకుల గుర్తును చేజిక్కించుకునేందుకు ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి లంచం ఇవ్వజూపారనే కారణంతో ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు.

శశికళతో భేటీ సందర్భంగా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై దినకరన్ చర్చించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల తీరుపై కూడా వీరు చర్చించనున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి పళనిస్వామి జైల్లో ఉన్న శశికళను ఇంతవరకు కలవకపోవడంపై శశి వర్గం కోపంతో ఉంది.

  • Loading...

More Telugu News