: భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక క్షిపణి వ్యవస్థ.. క్యూఆర్-ఎస్ఏఎం పరీక్ష విజయవంతం
భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక క్షిపణి వ్యవస్థ వచ్చి చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (క్యూఆర్-ఎస్ఏఎం)ను ఆదివారం ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. క్యూఆర్-ఎస్ఏఎంను పరీక్షించడం ఇదే తొలిసారి. దీనిని డీఆర్‌డీఓ, భారత్ ఎలక్ట్రానిక్స్ కలిసి అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణిని ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయోగించవచ్చు. 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి తుత్తినియలు చేయగలదు. ఆదివారం నాటి పరీక్షకు ముందు చాందీపూర్‌లోని టెస్ట్ రేంజ్ నుంచి ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాలను ఛేదించే పైథాన్, డెర్బీ (స్పైడర్) క్షిపణులను పరీక్షించినట్టు అధికారులు తెలిపారు.