: ఖమ్మంలో వృద్ధుడి అరాచకం.. మహిళపై అత్యాచారం.. అతడి భార్య వీడియో చిత్రీకరణ!


60 ఏళ్ల వృద్ధుడు ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడితే అతడి భార్య దానిని వీడియో తీసిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీసులు తాజాగా వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. జి.సత్యనారాయణ (60), వసంత భార్యాభర్తలు. వారు పరిచయస్తులు కావడంతో బాధిత మహిళ తరచూ వారింటికి వెళ్లేది.

మూడు నెలల క్రితం వారింటికి వెళ్లిన సదరు మహిళను దంపతులు బీరు తీసుకోమని బలవంతం చేశారు. ముగ్గురు కలిసి బీరు తాగారు. అనంతరం మహిళపై సత్యనారాయణ అత్యాచారానికి పాల్పడగా, అతని భార్య మొబైల్ ఫోన్‌లో ఆ దృశ్యాన్ని వీడియో తీసింది. ఫ్యాన్సీ స్టోరు నడుపుతున్న బాధిత మహిళకు నిందితుడు రూ.80 వేలు అప్పు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అత్యాచారం సమయంలో తీసిన వీడియోను చూపించిన నిందితుడు దానిని బయటపెడతానని భయపెట్టి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News