: అవును.. ఆ దాడి మా పనే.. లండన్ ఉగ్రదాడిపై ఇస్లామిక్ స్టేట్ ప్రకటన
శనివారం రాత్రి లండన్ బ్రిడ్జిపై జరిగిన ఉగ్రదాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) ప్రకటించింది. ‘‘ఇస్లామిక్ స్టేట్ పోరాట యోధులు శనివారం లండన్‌లో దాడికి పాల్పడ్డారు’’.. అని అమాఖ్ మీడియా పేజీలో ఐసిస్ పేర్కొంది. లండన్ బ్రిడ్జిపై శనివారం రాత్రి ముగ్గురు ఉగ్రవాదులు వ్యాన్‌తో బీభత్సం సృష్టించారు. పాదచారులపైకి వాహనాన్ని ఎక్కించారు. కొందరిని కత్తితో గాయపరిచారు. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మూడు నెలల్లో బ్రిటన్‌లో జరిగిన మూడో ఉగ్రదాడి ఇది.