: పాక్ ను మరోమారు హెచ్చరించిన రాజ్ నాథ్
పాక్ కాల్పులకు పాల్పడితే, భారత్ ఇకపై బుల్లెట్లను లెక్కపెట్టుకోదని పాకిస్థాన్ ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిర్ పూర్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ లో శాంతి భద్రతలను దెబ్బతీయాలని పాక్ మళ్లీ మళ్లీ యత్నిస్తోందని, పాకిస్థాన్ ఆటలు ఎక్కువ కాలం కొనసాగవని హెచ్చరించారు. దేశ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల త్యాగాన్ని భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు.