: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజ్ ఇస్తే ఎవరు కాదంటారు?: అఖిలేష్ యాదవ్
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజ్ కూడా ఇస్తే ఎవరు కాదంటారని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గుంటూరులో ‘ప్రత్యేక హోదాకు భరోసా’ సభలో అఖిలేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వెళ్లి ఎందుకు డిమాండ్ చేయట్లేదని, వెనుకబడిన ఏపీ, యూపీ రాష్ట్రాల కోసం కేంద్రం నిధులు కేటాయించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.