: భారత్-పాక్ మ్యాచ్.. ఓవర్ల కుదింపు!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కు మరోమారు వర్షంతో ఆటంకం కలిగింది. దీంతో, ఈ మ్యాచ్ ను 48 ఓవర్లకు కుదించారు. కాగా, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 33.1 ఓవర్లలో భారత్ స్కోర్ 173/1. ఓపెనర్ రోహిత్ శర్మ 77 పరుగులతో, కోహ్లీ 24 పరుగులతో కొనసాగుతున్నారు.