: త్రివిక్రమ్ సూచన... వైట్ రైస్ కు దూరంగా పవన్ కల్యాణ్?


మార్షల్ ఆర్ట్స్ లో ఆరి తేరిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన హైట్ కు తగిన వెయిట్ తో యాక్టివ్ గా ఉండే పవన్ కు ఇప్పుడు కొత్తగా ఓ సమస్య వచ్చిపడింది. మామూలుగా వైట్ రైస్, కూరలు మినహా వేరే ఆహారాన్ని పవన్ ఎక్కువగా తీసుకోడట. అయితే, ఇప్పుడు ఆ వైట్ రైస్ ను దూరంగా పెట్టాలని పవన్ నిర్ణయించుకున్నాడట. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచన మేరకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వైట్ రైస్ కారణంగా పవన్ ముఖం కొంచెం ఉబ్బుతోందట. దీంతో, వైట్ రైస్ ను పక్కనబెట్టాలని త్రివిక్రమ్ సూచించారట. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ జరిగినన్ని రోజులు వైట్ రైస్ లేకుండా మెనూ సిద్ధం చేసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నాడట.

  • Loading...

More Telugu News