: రాహుల్ రాకను నిరసిస్తూ తెలుగు యువత ఆందోళన


గుంటూరులో నిర్వహించే ‘ప్రత్యేక హోదా భరోసా’ సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రావడాన్ని టీడీపీ శ్రేణులు నిరసిస్తున్నాయి. మంగళగిరి జాతీయ రహదారిపై, చినకాకాని, తాడేపల్లి పాత టోల్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై నల్లజెండాలతో నిరసన తెలుపుతూ.. ‘తెలుగు జాతిని నిలువునా చీల్చిన నేతలు వెనక్కి వెళ్లాలి’ అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేస్తున్నారు. కాగా, రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ ఎదుట ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News