: ‘నవ నిర్మాణ దీక్ష’ పేరిట చంద్రబాబు నయవంచన!: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా


‘నవ నిర్మాణ దీక్ష’ పేరిట సీఎం చంద్రబాబునాయుడు నయవంచనకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రమైన ఆరోపణ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, నయవంచనకు పాల్పడుతున్నారనే విషయం తెలిసే ప్రజలు ఈ దీక్షకు వెళ్లలేదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని, నవనిర్మాణ దీక్ష పేరిట ప్రజలను మళ్లీ నయవంచన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించినందుకే నాడు జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News