: ఏపీలో పర్యటించే హక్కు రాహుల్ కు లేదు: డిప్యూటీ సీఎం కేఈ


ఏపీలో పర్యటించే హక్కు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్విభజన చేసి, ఏపీని కట్టుబట్టలతో పంపించి, ఇవాళ ఎలా ఉన్నారో చూసేందుకు వస్తున్నారా? పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎప్పుడైనా ప్రత్యేక హోదాను ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసి నాడు రాష్ట్రాన్ని పునర్విభజించిందని మండిపడ్డారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, రాహుల్ రాష్ట్ర పర్యటన కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని ఆరోపించారు.

  • Loading...

More Telugu News