: 35 కోట్లు వసూలు చేసిన 'రారండోయ్..'.. నాగచైతన్య సినిమా రికార్డు!
అక్కినేని నాగ చైతన్య నటించిన సినిమాల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా రికార్డుల కెక్కింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ఈ సినిమా విడుదలై తొమ్మిది రోజులు కావస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.35 కోట్లు ఈ చిత్రం రాబట్టడం విశేషం. ఇందులో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది.