: దాయాదిని చిత్తు చేయాలని కోరుతూ.. దేశవ్యాప్తంగా పూజలు, హోమాలు, యాగాలు!
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, శత్రు దేశంపై భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ దేశ వ్యాప్తంగా పూజలు, హోమాలు, యాగాలు చేస్తున్నారు అభిమానులు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, గోరఖ్ పూర్ లలో హోమాలు నిర్వహించారు. మన చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేయాలని దేవుడిని ప్రార్థించారు.
రంజాన్ మాసం సందర్భంగానే కాదు, మన దేశం గెలవాలని కూడా తాను ఉపవాసం చేస్తున్నానంటూ జమ్మూకశ్మీర్ కు చెందిన ఓ అభిమాని చెప్పాడు. పాక్ బౌలర్లపై కోహ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని మరికొందరు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. కోహ్లీ నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ను ఆశిస్తున్నామని ఢిల్లీకి చెందిన ఓ అభిమాని చెప్పాడు. అయితే, కోహ్లీ భరతం పడతానంటూ బీరాలు పలికిన పాక్ బౌలర్ జునైద్ ఖాన్ జట్టులో లేకపోవడం పట్ల పలువురు అభిమానులు కొంచెం నిరాశను వ్యక్తం చేశారు.