: బ్రిటన్ కు మేము అండగా ఉంటాం.. ట్రావెల్ బ్యాన్ అవసరమే: డొనాల్డ్ ట్రంప్


లండన్ లో గత రాత్రి జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. బ్రిటన్ కు అమెరికా పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. 'మీతో మేమున్నాం. గాడ్ బ్లెస్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత కఠినంగా, అప్రమత్తంగా, తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కోర్టులు కూడా మన హక్కులను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతను కల్పించే నేపథ్యంలో, ట్రావెల్ బ్యాన్ ను విధించాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు.

అమెరికా అంతర్గత భద్రత శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, లండన్ దాడిని తాము అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికిప్పుడు అమెరికాకు టెర్రరిస్టుల ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం ప్రస్తుతానికైతే తమ వద్ద లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News