: 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న భారీ వర్షాలు!
భానుడి భగభగలతో ఇన్ని రోజులు విలవిల్లాడిన తెలుగు రాష్ట్రాలను భారీ వర్షం ముంచెత్తబోతోంది. రానున్న 24 గంటల్లో ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో పలు చోట్ల, కోస్తా, తెలంగాణల్లో అక్కడక్కడా నిన్న ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ ఉదయం కూడా తెలంగాణలోని జయశంకర్ జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది.