: కోలీవుడ్‌లో సంచలనం.. యంగ్ హీరోయిన్‌ను పెళ్లాడిన ఓల్డ్ డైరెక్టర్!


కోలీవుడ్ డైరెక్టర్ వేలు ప్రభాకర్ ఇప్పుడు తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారారు. 60 ఏళ్ల వయసున్న ఆయన 30 ఏళ్ల హీరోయిన్ షెర్లీదాస్‌ను మీడియా సమక్షంలో వివాహమాడి సంచలనం సృష్టించారు. గతంలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా ‘ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ’ పేరుతో ఓ చిత్రాన్ని తనే హీరోగా తెరకెక్కించారు.  దీనిని తెలుగులో ‘ఓ దర్శకుడి ప్రేమ కథ’గా విడుదల చేశారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చెన్నైలోని లీ మ్యాజిక్ లాంటెర్న్ థియేటర్‌లో ప్రదర్శించే సినిమా ప్రివ్యూ కోసం ప్రభాకరన్ మీడియాను ఆహ్వానించారు. ప్రివ్యూకు హాజరైన మీడియా ప్రతినిధులకు ఆయన షాకిచ్చారు. గతంలో తన సినిమాలో నటించిన షెర్లీదాస్‌ను పెళ్లాడుతున్నట్టు ప్రకటించి అక్కడికక్కడే ఉంగరాలు, దండలు మార్చుకున్నారు. మీడియా తేరుకునేలోపే వారిద్దరూ ఒక్కటయ్యారు. షెర్లీతో గతంలో సినిమా తీసినప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని, అది పెళ్లికి దారితీసిందని ప్రభాకరన్ పేర్కొన్నారు. కాగా, తాజాగా విడుదలైన ప్రభాకరన్ సినిమాలోని కథ ఓ దర్శకుడు.. హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లాడడం ఇతివృత్తంగా నడుస్తుంది. నిజ జీవితంలోనూ ప్రభాకరన్ అలానే చేయడం కాకుండా ఆ సినిమా విడుదల రోజే షెర్లీ చేయందుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News