: మంచు మనోజ్‌కి మంచి నీళ్లు తాగించిన ఎన్టీఆర్ కుమారుడు!


టాలీవుడ్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కుమారుడు అభ‌య్ స్వ‌యంగా ఓ గాజుగ్లాసులో నీరు తీసుకువ‌చ్చి టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్‌కి తాగించాడు. ఆ స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోను మంచు మ‌నోజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘చల్లటి నీళ్లతో నాకు స్వాగతం. తారక్‌కి కరెక్ట్‌ మొగుడు నా బుజ్జి అభయ్‌ కుట్టి’ అని పేర్కొన్నాడు. అంతేకాదు అభ‌య్ ఎనర్జీ ఎన్టీఆర్ ఎనర్జీ క‌న్నా వందరెట్లు అధిక‌మ‌ని మ‌నోజ్‌ అన్నాడు. మంచు మ‌నోజ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో అటు మంచు అభిమానులను, ఇటు నంద‌మూరి అభిమానుల‌ను అల‌రిస్తోంది.                    

  • Loading...

More Telugu News