: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
మధ్యాహ్నం పూట ఠారెత్తిస్తోన్న ఎండలతో బాధపడుతున్న హైదరాబాద్ వాసులు సాయంత్రం దాటాక మాత్రం వర్షాన్ని చూస్తున్నారు. నాలుగు రోజులగా భాగ్యనగరంలో ఇదే పరిస్థితి. ఈ రోజు కూడా రాత్రి 8 గంటల సమయం దాటాక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, మోహిదీ పట్నం, మాసబ్ ట్యాంక్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. యూసఫ్ గూడ, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామాంతపూర్, హబ్సిగూడ, అంబర్ పేట పరిసర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి.