: హీరో వ‌రుణ్ తేజ్‌కి అద్భుత బ‌హుమ‌తిని ఇచ్చిన యువ‌తి


'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కంచె, లోఫ‌ర్‌, మిస్ట‌ర్ సినిమాల‌తో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న‌ ‘మెగా’ హీరో వ‌రుణ్ తేజ్‌కి ఈ రోజు ఆయ‌న అభిమాని అద్భుత బ‌హుమ‌తి ఇచ్చింది. రవళిక అనే యువతి వరుణ్ తేజ్ ముఖంలోని స‌గం భాగాన్ని చూపిస్తూ గ‌డ్డం, మీసాల‌తో ఉన్న ఆయన చిత్రాన్ని స్వ‌యంగా గీసి తీసుకొచ్చి త‌న అభిమాన న‌టుడికి అందించింది. అనంత‌రం ఆయ‌నతో ఫొటోలు దిగి మురిసిపోయింది. ఈ విష‌యాన్ని ఓ సినిమా విశ్లేష‌కుడు ట్విట్ట‌ర్ ద్వారా తెలుప‌గా, ఈ పోస్టుకి థ్యాంక్స్ అంటూ వ‌రుణ్ తేజ్ రిప్లై ఇచ్చాడు.                


  • Loading...

More Telugu News