: కార్టూన్ ప్రోగ్రాంలు చూసేవాడు... అచ్చం అందులో చూపినట్లే చేసి ప్రాణాలు కోల్పోయాడు!
హైదరాబాద్ లోని వెంకటాపురం ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేసవి సెలవుల్లో టీవీలో కార్టూన్ కార్యక్రమాలు చూడటానికి అలవాటు పడిన ఐదవ తరగతి చిన్నారి జయదేవ్... అందులోని ఓ పాత్రను అనుకరిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. టీవీలో ఓ కార్టూన్ ప్రోగ్రామ్ లో చూపినట్లే, తనకు నిప్పు అంటుకున్నా ఏమీ కాదని అనుకున్నాడు. అలా చేస్తే ప్రమాదం అని తెలియని ఆ బాలుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్టుగా కేసు నమోదు చేసుకున్నారు. ఆ పిల్లాడి వంటిపై మంటలను గమనించిన ఆ బాలుడి బంధువులు మంటలను ఆర్పేసి ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదని పోలీసులు తెలిపారు.