: చైనాలో ‘బాహుబలి-2’ విడుదల తేదీపై వస్తోన్న పుకార్లపై స్పందించిన నిర్మాత
ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమా చైనాలో ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశంలో విడుదల కానున్న ‘బాహుబలి-2’ సినిమాపైనే సినీ అభిమానుల దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ‘బాహుబలి-2’ రీలీజ్ పై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. ఆ దేశంలో ‘బాహుబలి 2’ సినిమా విడుదల తేదీ ఖరారైందని, ఇక విడుదల చేయడమే తరువాయి అని కొందరు అంటున్నారు.
అయితే, ఈ వార్తలపై స్పందించిన బాహుబలి నిర్మాత శోభూ యార్లగడ్డ చైనాలో ‘బాహుబలి-2’ విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. ఆ దేశంలో విడుదల చేయడానికి అవసరమైన ప్రక్రియ మాత్రం ప్రారంభమైందని చెప్పారు. ఆమిర్ ఖాన్ పీకే, దంగల్ వంటి చిత్రాల్ని చైనాలో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటరే ‘బాహుబలి-2’ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నారని చెప్పారు. చైనాలో బాహుబలి-1 సినిమాకు అంతగా స్పందన రాలేదు. బాహుబలి-2కి మంచి స్పందన వస్తుందని ఆ చిత్రం యూనిట్ భావిస్తోంది.