: వృద్ధురాలిని టీజ్ చేసిన వృద్ధుడు... పోలీసులకు పట్టించిన స్థానికులు


డయాబెటిస్‌తో బాధ పడుతున్న ఓ వృద్ధుడు తెల్ల‌వారు జామున పొరుగింట్లోకి వెళ్లి ఓ వృద్ధురాలిని టీజ్ చేసిన ఘ‌ట‌న అహ్మదాబాద్‌లోని రామోల్ పోలీసు స్టేషన్ పరిధిలో జ‌రిగింది. ఆ వృద్ధురాలు గట్టిగా అర‌వ‌డంతో స్థానికులు ఆ వృద్ధుడిని ప‌ట్టుకొని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆ వృద్ధుడి వ‌య‌సు 66 ఏళ్లు ఉంటుంద‌ని, 60 ఏళ్ల వృద్ధురాలిని టీజ్ చేశాడ‌ని పోలీసులు తెలిపారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఆ వృద్ధుడితో ఆమెకు క్షమాపణలు చెప్పించినట్లు చెప్పారు. కాగా, తాను షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాన‌ని, తాను ఉద్దేశపూర్వకంగా టీజ్ చేయలేదని వృద్ధుడు తెలిపాడ‌ని అన్నారు. మరోసారి ఇటువంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డితే బాగుండ‌ద‌ని ఆ వృద్ధురాలి కుటుంబ స‌భ్యులు వార్నింగ్ ఇచ్చారు.           

  • Loading...

More Telugu News