: శ్రీదేవి కొత్త సినిమా ట్రైలర్ అదుర్స్!
ఎన్నో ఏళ్ల తరువాత నటి శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మళ్లీ కొద్దిగా గ్యాప్ తీసుకున్న శ్రీదేవి మళ్లీ ఇప్పుడు ‘మామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. దర్శకుడు రవి ఉద్యవర్ ఈ సినిమాను హత్య మిస్టరీ కథతో చిత్రీకరిస్తున్నారు. తన కూతురిని రక్షించుకునేందుకు పోరాడే తల్లిగా శ్రీదేవి కనపడుతోంది. ఈ సినిమాలో పాకిస్థాన్ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో కనపడనున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చేనెల 7న విడుదల చేయనున్నారు.