: మరింత పెరిగిన బంగారం ధర
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావానికి తోడు, స్థానిక నగల తయారీదారులనుంచి డిమాండ్ పెరుగుతుండడంతో బంగారం ధరలు మళ్లీ పై పైకి వెళ్లిపోతున్నాయి. ఈ రోజు కూడా 10 గ్రాముల బంగారం ధర మరో 300 రూపాయలు పెరిగింది. దీంతో మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 29,550కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తూ ఈ రోజు భారీగా పెరిగింది. కిలోకి రూ.1,170 పెరగడంతో వెండి ధర ఈ రోజు రూ.40,470గా స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది.