: మెగా హీరోల విషయంలో నేను తప్పు చేశా: వర్మ
సంచలనాలకు మారుపేరైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాజకీయవేత్తల నుంచి మెగా హీరోల వరకు ఆయన ఏ ఒక్కరినీ వదల్లేదు. ఇటీవలే ఆయన ట్విట్టర్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. మెగా హీరోలపై గతంలో తాను చేసిన కామెంట్లపై వర్మ తాజాగా స్పందించాడు.
మెగా హీరోల విషయంలో తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని... భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని, అవతలివారి మనోభావాలు గాయపడేలా ప్రవర్తించడం సరికాదని చెప్పాడు. అయితే, ఈ విషయాన్ని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని అన్నాడు. ట్విట్టర్ ద్వారా తాను ఎవరెవరిని టార్గెట్ చేయాలనుకున్నానో... వారంతా తనకు బోర్ కొట్టేశారని చెప్పాడు. వారిపై తాను చేస్తున్న ట్వీట్లు తనకు కూడా బోర్ కొట్టాయని... అందుకే ట్విట్టర్ ను వదిలేశానని తెలిపాడు.