: హరీశ్‌రావుకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
తెలంగాణ భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావు స్పష్టంగా భావ ప్రకటన చేస్తారని, కష్టపడేతత్వం, సమర్థతను కలిగి ఉంటారని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. హరీశ్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఈ రోజు కేసీఆర్ కిట్‌ల పథకం ప్రారంభమైన నేపథ్యంలో హరీశ్‌రావు తన నియోజకవర్గం సిద్ధిపేటలో ఇంటింటికీ వెళ్లి అభిమానులను పలకరించి బాలింతలకు కిట్లు పంపిణీ చేశారు.