: పాశ్చాత్య సంస్కృతి వల్లే రేప్, తలాక్ లు : ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
పాశ్చాత్య సంస్కృతి వల్లే మనదేశంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ అన్నారు. ముంబైలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రేమ స్వచ్ఛమైనదే కానీ పాశ్చాత్య సంస్కృతి దాన్ని ఓ ఫ్యాషన్ గా, బిజినెస్ గా మార్చిందిని అన్నారు. అత్యాచారాలు, గృహహింస, ఇస్లాం సంప్రదాయంలోని ముమ్మారు తలాక్, భ్రూణహత్యల వెనుక కారణం కూడా అదేనని అన్నారు. ప్రేమికుల రోజున ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా, గతంలో కూడా బీఫ్ ఫెస్ట్ గురించి ఆయన మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు బీఫ్ ఫెస్ట్ లో పాల్గొని దేశాన్ని అవమానాల పాలు చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.