: సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియలెస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ: శైలజానాథ్ చురక


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. మూడేళ్ల కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. సీఆర్డీఏ అంటే 'చంద్రబాబు రియలెస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ' అని ఆయన ఎద్దేవా చేశారు. రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు ఒక్క చుక్క నీటిని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హంద్రీనీవా కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతేనని చెప్పారు. రాయలసీమపై చంద్రబాబు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News