: కరణ్ జొహార్ చేతికి 'స్పైడర్' హిందీ వెర్షన్?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేహ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్లో 'స్పైడర్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు చెందిన పోస్టర్, టీజర్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. 'స్పైడర్' టీజర్ ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 63 లక్షలకు పైగా వ్యూస్ ను ఈ టీజర్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

టీజర్ ను వీక్షించిన బాలీవుడ్ ప్రముఖులు సంతృప్తిని వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే... ఈ సినిమాను బాలీవుడ్ లో తన బ్యానర్ లో విడుదల చేసేందుకు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జొహార్ ప్లాన్ చేస్తున్నాడట. 'బాహుబలి' సీరీస్ లోని రెండు సినిమాలను కూడా బాలీవుడ్ లో కరణ్ జొహారే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరణ్ బ్యానర్ లో ఈ సినిమా విడుదలైతే... మరింత పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారు.  

  • Loading...

More Telugu News