: నా జీవిత చరిత్రను సినిమాగా తీయద్దు!: యడ్యూరప్ప
తన జీవిత చరిత్రను సినిమాగా తీయాల్సిన అవసరం లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూక హుడగి గ్రామంలో దళితుని ఇంట భోజనం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ నేత రుద్రేష్ తన జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాల్ని చేస్తున్నారని విన్నానని చెప్పారు. ఈ విషయంలో ఇంతవరకు తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన చెప్పారు. తన జీవితం తెరచిన పుస్తకమని ఆయన అన్నారు. తన జీవిత చరిత్ర గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సిందేమీ లేదని...అందుకే తన జీవిత చరిత్రను సినిమాగా తీయాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. ఇందులో వివాదానికి తావు లేదని ఆయన తెలిపారు.