: 'వివేగం' రికార్డును తుడిచేసిన 'స్పైడర్' టీజర్
సినీ పరిశ్రమలో ఒక సినిమా నెలకొల్పిన రికార్డును మరోసినిమా అధిగమిస్తోంది. ఈ మధ్యే విడుదలైన కోలీవుడ్ 'తల' అజిత్ 'వివేగం' టీజర్ రికార్డును మహేష్ బాబు 'స్పైడర్' టీజర్ తుడిచేసింది. 'స్పైడర్' టీజర్ ను విడుదల చేసిన 24 గంటల్లో 63 లక్షల మంది ఈ టీజర్ ను చూడడం విశేషం. ఈ టీజర్ పై యూత్ బాగా ఆసక్తి చూపించారని తెలుస్తోంది. మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా టీజర్ రాగానే ఇరగబడి చూశారు. 'స్పైడర్' టీజర్ కు మంచి ఆదరణ లభించడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.